రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో హీరో రవితేజ సోదరుడు, నటుడు భరత్ రాజు మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఆగివున్న లారీని ఢీకొనడంతో, తీవ్ర గాయాల పాలైన భరత్ రాజు అక్కడికక్కడే కన్నుమూశారు.

శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇప్పుడే ఘటనా స్థలికి చేరుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతిదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఆర్ జీఐ పోలీసులు. శంషాబాద్ లోని నోవాటెల్ నుంచి సిటికి వస్తుండగా... ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Click for more videos..
No comments:
Post a Comment